logo

వెలం కాయలపాలెం చెరువు ఆక్రమణ సర్వేలో అవకతవకలు

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం వెలంకాయలపాలెం చెరువు ఆక్రమణలు గ్రామ జీవితాన్ని ముంచుతున్నాయి కొండపాలెం పంచాయతీకి చెందిన వెలంకాయలపాలెం గ్రామంలో 7.87 ఎకరాల చెరువు ఇప్పుడు 4 ఎకరాలకు తగ్గిపోయింది. సర్వే నంబర్ 91 (LP No: 1788)లో ఉన్న ఈ చెరువు ఆక్రమణలతో రైతుల పంటలు, గ్రామ సాంప్రదాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ప్రమాదంలో పడ్డాయి.రైతుల ఆవేదన: "చెరువు లేకపోతే మా జీవనాధారం పోతుంది"రైతులు బేజవాడ వాసు, శ్రీను, మణికంఠ, ప్రసాద్, సూర్యచంద్ర, సత్తిరాజు, పెంటయ్య, నాగేశ్వరరావు, చిరంజీవి మాటల్లో — కొందరు వ్యక్తులు చెరువు గట్టులు వేసి, మట్టి నింపి, దున్ని పంటలు వేసుకున్నారు. "పంట కాలంలో ఈ చెరువు నీరే మా పొలాలకు ఆధారం. వర్షపు నీరు బయటకు వెళ్తోంది. కొద్ది కాలంలో చెరువు పూర్తిగా అదృశ్యమవుతుంది," అని వారు ఆందోళన వ్యక్తం చేశారు.అంత్యక్రియల సమయంలో చెరువు ప్రాంతంలో జరిగే సాంప్రదాయ కార్యక్రమాలకు స్థలం దొరకడం, ఉపాధి హామీ పథకం పనులు అడ్డుకోవడం వంటి సమస్యలు తలెత్తాయి. "నీటి దారులు మూసేసి, చెరువు రూపం మారిపోతోంది," అని గ్రామస్థులు వాపోతున్నారు. రీసర్వేఎమ్మార్వో ఫిర్యాదు మేరకు జరిగిన తాజా సర్వేలో సర్వేయర్ మహేష్ తెలిపినట్లు, జగనన్న సర్వే రిపోర్ట్ ప్రకారం రెండింటికి 14 సెట్లు తేడా ఉంది. అయితే గ్రామ ప్రజలు 1985 సర్వే రికార్డులను ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో 'YSR జగనన్న శాశ్వత భూ హక్కు' పథకం కింద 2020 నుంచి భూ రీసర్వేలు జరుగుతున్నాయి. ఇది బ్రిటిష్ కాలం తర్వాత మొదటి సమగ్ర సర్వే కానీ పాత రికార్డులు, కొత్త సర్వేల మధ్య తేడాలు ఇలాంటి వివాదాలకు కారణమవుతున్నాయి.వెలంకాయలపాలెంలో ఇప్పటికే అధికారులు, నాయకులకు ఫిర్యాదులు చేశారు కానీ పరిష్కారం రాలేదు. ఇలాంటి సమస్యలు పంట సాగు, పర్యావరణాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

6
371 views