logo

ముందస్తు సంక్రాంతి సంబరాలను దొర్నిపాడు లోని శ్రీ వాణి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్విద్యార్థి బృందంతో సంబరాలను చేశారు

రేపటినుండి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పురస్కరించుకొని ముందస్తు సంక్రాంతి సంబరాలను దొర్నిపాడు లోని శ్రీ వాణి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం యుపి స్కూల్ లో కరస్పాండెంట్ జె డి గిరి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ బాషా విచ్చేసి ఉపాధ్యాయులతో విద్యార్థి బృందంతో ముందస్తు సంక్రాంతి సంబరాలను ప్రారంభం చేశారు విద్యార్థులకు సంక్రాంతి పండగ విశిష్టతను అవగాహనను తెలిపేందుకు భోగి మంటలు రంగురంగుల ముగ్గులు హరిదాసు వేషాలు పతంగులను ఎగిరివేయడం కోడిపందాల పండగ వస్త్రాదరణతో సాంస్కృతి కార్యక్రమముతో భోగి సంక్రాంతి కనుమ పండగ కార్యక్రమాలు జరిపి స్ఫూర్తిగా నిలిచారు ఈ సందర్భంగా అపుస్మా ఆళ్లగడ్డ నియోజవర్గం యూనిట్ అధ్యక్షులు టి అమీర్ బాషా మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటే తెలుగువారి సంప్రదాయాలకు సరదాలకు స్ఫూర్తిదాయకం పల్లె ప్రజలకు సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను కలిగి చాలా ఇష్టమైన పండగ రైతు పండించే ధనలక్ష్మి ఇంటికి వచ్చే తరణం సంక్రాంతి పండగ ఇంటి ముంగిట్లో రకరకాల రంగుల ముగ్గులతో ఆవు పేడతో గొబ్బెమ్మలతో సంక్రాంతి పండగ ప్రత్యేకమైన సందడి సంక్రాంతి పండగ సకల శుభాలకు క్రాంతి భోగి మంటలు, హరిలో రంగ హరి అంటూ హరినామ స్మరణ చేస్తూ హరిదాసుల సందడి అయ్యకు దండం పెట్టు అమ్మకు దండం పెట్టు డు డు బసవన్న అంటూ గంగిరెద్దుల సందడి గాలిపటాలు ఎగురువేయడం కర్ర సామ్ విన్యాసాలు పిల్లలకు భోగి పండ్ల విశేషము బొమ్మల కొలువు కొత్త బట్టల సంప్రదాయమైన దుస్తులు ధరించడం పిండివంటలు ఆరగించడం కనుమ రోజున పశువులను పూజించడం మన తెలుగువారి సాంస్కృతిక సంప్రదాయ ఆచార వ్యవహారాలకు స్ఫూర్తిదాయకం సూర్యుడు మకర రాశిలోకి రావడం దక్షిణాయ వచ్చినాయ కాలం నుండి ఉత్తరాయణ కాలం రావడం పండగ యొక్క విశిష్టత విద్య ఉపాధ్యాయ వాణిజ్య రంగంలో పట్టణాలలో రాణిస్తూ మూడు రోజులు పల్లె ప్రాంతానికి బంధువులతో మిత్రులతో గడపడం పండగ యొక్క విశేషం

6
252 views