logo

01-01-2026 *కేసుల ద్వారా విద్యార్థి యువజన ఉద్యమాల్ని అణిచివేయడం ఎవరివల్లా కాదు???*

*కేసుల ద్వారా విద్యార్థి యువజన ఉద్యమాల్ని అణిచివేయడం ఎవరివల్లా కాదు???*

*ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు చేయాలని అడిగితే విద్యార్థి యువజన నాయకులపైన రౌడీ షీట్ల*

*రాష్ట్రంలో ప్రజా పరిపాల నడుస్తూ ఉందా లేక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందా??*

*విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన పెట్టిన రౌడీ షీట్ ను ఎత్తివేయాలి*

*ఐక్య విద్యార్థి యువజన సంఘాల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన*

*అనంతపురం అర్బన్::: విద్యార్థులకు యువజనలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులు పైన కేసులు నమోదు చేసి జైలకు పంపుతూ రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని ఖండిస్తూ రాష్ట్ర సమితి పిలుపుమేరకు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొత్రేస్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేంద్ర జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ వైయస్సార్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు మదన్మోహన్ జిల్లా అధ్యక్షులు సాకే చంద్ర ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ ఏఐఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన నడుస్తుందా లేదంటే నారా లోకేష్ తీసుకున్న రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు మేము అడగడం లేదు ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే విద్యార్థి యువజన సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలకు తరలించి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థి యువజన సమస్యలు నేరుగా నా దృష్టికి తీసుకురండి అన్న నారా లోకేష్ గారు నేడు సమస్యలు ఉన్నాయని ప్రశ్నిస్తున్న నాయకుల పైన కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6400 కోట్లు విడుదల చేయకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం పైన కావస్తున్నా నేటికీ ఏ మాత్రం కూడా వాటిని ఆలోచించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. రియంబర్స్మెంట్ విడుదల చేయాలన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు మాత్రం ఉండవు. మీ క్యాబినెట్లో మీ పార్టీలలో ఉన్నటువంటి నాయకులకు చైర్మన్లు డైరెక్టర్లు పదవులు ఇస్తూ వాళ్లకు నెలనెలా జీతాలు ఇవ్వడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయని ప్రశ్నించారు. విశాఖపట్నంలో గత రెండు సంవత్సరాల క్రితం పాతగా ఉన్నటువంటి కేసులను తోడి నేడు రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి ఖండించారు తక్షణమే పెట్టినటువంటి రౌడీషీట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు,, విద్యార్థి యువజన రంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి విజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమరసిర పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు హనుమంతు మంజు చందు ఉమా మహేష్ సమీర్ నాని రాకేష్ ధనుంజయ శ్రీనివాసులు ఆనంద్ ఉస్మాన్ సాయి నవీన్ రెడ్డి, విజయ్ రెడ్డి,మంజునాథ్ రెడ్డి కైలాష్ సుధీర్ రెడ్డి,ఫయాజ్,హరీష్,మెహరాజ్,చరన్,నవీన్,లోకేష్,శేఖర్,తేజు, భాను,ఇమ్రాన్,జగన్,సాయి, జాషువా,శివ తదితరులు పాల్గొన్నారు*

0
5 views