
రసాయన వ్యవసాయం వీడి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసులు గారు సూచించారు.
ఆళ్లగడ్డ: శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ శాఖలు- రైతు సాధికార సంస్థ, సెర్ఫ్, వెలుగు డి.ఆర్.డి.ఎ శాఖలతో సమన్వయంతో మండల స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ రైతులు *రసాయన వ్యవసాయం వీడి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాలని సూచించారు. రసాయనాలు భూమితో పాటు మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని, సర్వ మానవాళికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఆరోగ్యంగా బ్రతకడం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం తో ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చన్నారు*. *అనంతరం వెలుగు ఏరియా కో-ఆర్డినేటర్ గోపాల్ గారు మాట్లాడుతూ*..
ప్రతి గ్రామ సంఘం సమావేశంలో ప్రకృతి వ్యవసాయంపై చర్చించాలని, *ప్రతి ఇంట్లో పెరటి తోటలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మండలంలో 240 కిచెన్ గార్డెన్స్ కిట్స్ పంపిణీ చేశామని తెలిపారు*.
*ఆళ్లగడ్డ మండలం వ్యవసాయ అధికారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రసాయనాలు వినియోగించడం వలన భూమి సారవంతం కోల్పోతుందన్నారు*.
*ఆళ్లగడ్డ మండలం MPDO నూర్జహాన్ మేడం గారు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ మండలంలో ప్రకృతి వైపు రైతులను మార్చాలని తెలిపారు* అనంతరం అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అబ్దుల్ సలాం మాట్లాడుతూ…రసాయనిక ఎరువుల విని యోగాన్ని తగ్గించి, స్థానిక ఎరువులను వినియోగించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మొక్క మొక్కలో బలం మరియు గింజ గింజలో ఆరోగ్యం ఉంటుంది అని తెలిపారు. మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన బిఆర్సీ సెంటర్ లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ఆళ్లగడ్డ డివిజన్ మాస్టర్ ట్రైనర్ రామాంజినేయ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ లో భాగంగా కొత్తగా ఏర్పడిన 4 గ్రామాల్లో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ (కేఎపి) అమలు విధానాలను వివరించారు. కార్యక్రమంలో వి. ఎ. ఎ లు, వి. హెచ్. ఎ లు, వి. ఎ. ఓ లు, సి.సి లు, వి. ఓ. ఎ లు, యం.యస్. ఈ. సి లీడర్లు, ప్రకృతి వ్యవసాయం ఆళ్లగడ్డ డివిజన్ మార్కెటింగ్ మాస్టర్ ట్రైనర్ అహోబిలం హరి , డివిజన్ MT రామాంజనేయరెడ్డి
మండల ఇన్చార్జి నాగేశ్వరరెడ్డి, వెలుగు సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.