logo

ఆర్‌బీఎస్‌కే–డీఈఐసీ ఆధ్వర్యంలో ఆర్‌డీటీ సమగ్ర విద్యా ప్రైమరీ పాఠశాలలో 4 డీల ఆధారంగా సమగ్ర ఆరోగ్య పరీక్షల కార్యక్రమం

పత్రిక ప్రకటన
09-01-2026

ఆర్‌బీఎస్‌కే–డీఈఐసీ ఆధ్వర్యంలో
ఆర్‌డీటీ సమగ్ర విద్యా ప్రైమరీ పాఠశాలలో
4 డీల ఆధారంగా సమగ్ర ఆరోగ్య పరీక్షల కార్యక్రమం

ఈ రోజు అనంతపురము జిల్లా, బుక్కరాయసముద్రం మండలంలోని ఆర్‌డీటీ ప్రైమరీ సమగ్ర విద్యా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ తల నుండి పాదం వరకు సమగ్ర ఆరోగ్య పరీక్షల కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ ఈ.బి. దేవి ఆధ్వర్యంలో,
ఆర్‌బీఎస్‌కే ఇన్‌చార్జ్ కార్యక్రమ అధికారి డాక్టర్ విష్ణుమూర్తి పర్యవేక్షణలో సమర్థవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమం ద్వారా పిల్లలలో ఉన్న 4 డీలు అనగా
* జన్మతహ లోపాలు,
* పోషక లోపాలు,
* వ్యాధులు,
* అభివృద్ధి సంబంధిత లోపాలు
గుర్తించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మొత్తం 103 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, అందులో
* ప్రవర్తనా లోపాలు మరియు అధిక చురుకుదనం ఉన్న విద్యార్థులు – 18 మంది,
* దంత సంబంధిత సమస్యలు ఉన్న విద్యార్థులు – 56 మంది,
* దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులు – 14 మంది & కంటి శుక్లం 1,
* శ్రవణ సంబంధిత సమస్యలు ఉన్న విద్యార్థులు – 99 మందిగా గుర్తించబడడం జరిగింది.
గుర్తించబడిన పిల్లలందరికీ అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు మరియు పునరావాస సేవలు అందించేందుకు అనంతపురము ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని జిల్లా ప్రారంభ జోక్యం కేంద్రం (డీఈఐసి), ఓ.పి నెంబర్ –99కు రిఫర్ చేయడం జరిగింది.

ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ఆర్‌డీటీ డైరెక్టర్ శ్రీ కె.ఎం. రఫీక్ ఆధ్వర్యంలో పూర్తి మద్దతు లభించి, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రారంభ జోక్యం కేంద్రం బృందానికి చెందిన
మేనేజర్ రజిత,
క్లినికల్ మనోవైద్య నిపుణుడు సుందరరావు సిరిగిరి,
దంత వైద్యురాలు ముత్యాలమ్మ,
శ్రవణ నిపుణురాలు గీత,
దృష్టి పరీక్ష నిపుణుడు జ్ఞాన ప్రసన్న,
నర్సింగ్ సిబ్బంది దివ్య,
మెడికో–సామాజిక కార్యకర్త రాజేశ్వరి,
తదితరులు తమ విలువైన సేవలను అందించారు.
అలాగే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడేందుకు బుక్కరాయసముద్రంలోని ఆర్‌డీటీ ప్రైమరీ పాఠశాల ఇన్‌స్టిట్యూషన్ కోఆర్డినేటర్ ఆర్. గీత,
మరియు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ పూర్తి సహకారం అందించి, పిల్లల ఆరోగ్య పరీక్షల ప్రక్రియను సజావుగా పూర్తిచేయడంలో కీలక పాత్ర పోషించారు.
ప్రత్యేక అవసరాలున్న పిల్లలను తొలిదశలోనే గుర్తించి, వారికి తగిన వైద్య చికిత్సలు మరియు పునరావాస సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం పిల్లల ఆరోగ్య పరిరక్షణ దిశగా ఒక ప్రశంసనీయమైన చర్యగా నిలిచింది.

4 డీలు గుర్తించబడిన పిల్లలందరికీ ప్రభుత్వ చైల్డ్ ట్రాన్స్‌పోర్ట్ వాహనం ద్వారా డీఈఐసిలో ఉచితంగా చికిత్స అందించబడుతుంది. మరియు ఇలాంటి పిల్లల మధ్య పిల్లలకు పాఠాలు చెప్పాలి అంటే ఎంతో స్ట్రెస్కి లోనవ్వుతూ ఉంటారు అలాంటి వారికీ స్ట్రెస్కి కౌన్సిలింగ్ను ఇచ్చి థెరపిని ఇచ్చి, టీచర్స్ కి స్ట్రెస్ థెరపీ క్లినికల్ సైకాలజిస్ట్ నేర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

5
903 views