logo

ముస్లింల అభివృద్ధికి పాటు పడాలి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష

ముస్లింల అభివృద్ధికి పాటు పడాలి

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష

కడప జనవరి 8

ముస్లింల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని డిప్యూటీ సీఎం అంజద్ భాష పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం కడప నగరంలోని షాహి దర్బార్ కన్వెన్షన్ హాల్లో గురువారం ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ షేక్ దస్తగిరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న అంజాద్ భాష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చలేదని అయన దుయ్యబడ్డారు. ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి ఒక బోర్డుపై ఉన్న వ్యక్తిగత పాసుబుక్కులను రద్దు చేయాలి ముస్లిముల కొరకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి అందులో 70 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు కల్పించాలని ముస్లిం యువతకు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముస్లింలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఉర్దూను ద్వితీయ భాషగా అమలు చేయాలని స్థానిక సంస్థల్లో ముస్లింలకు అడ్డంగా ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని వీటి హక్కుల కొరకై అన్ని సంఘాలతో కలిసి ఎంతటి ఉద్యమానికైనా వెనకాడమని ఆయన తెలిపారు. మానవ హక్కుల సాధన కోసం రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి ఎక్కడ ఉన్న ముస్లింలకు మేలు కలిగే విధంగా పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ షేక్ దస్తగిరి మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ముస్లిములను ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కి విస్తరించడం చాలా బాధాకరం. మరొక్కసారి చంద్రబాబు గారి చేతుల్లో ముస్లిం సమాజం మోసపోయింది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుంటే భవిష్యత్తులో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘాలను సొసైటీలను ట్రస్టులను ఏకం చేసి తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని తెలియజేయడం జరిగింది హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష , జాకీర్ హుస్సేన్, రియాజ్, మహబూబ్ బాషా, డాక్టర్ ఇబ్రహీం, హరిచంద్ర, సోహెల్,కలీం, రవి, సాదిక్, షబ్బీర్, తదితర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

5
209 views