సాలూరులోని ప్రభుత్వ ఐటీఐకి సొంత స్థలం కేటాయించాలి: ఏఐఎస్ఎఫ్ సాలూరు డిమాండ్
సాలూరు టౌన్ లోని ప్రభుత్వ ఐటీఐకు తక్షణమే సొంత స్థలం కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సాలూరు కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.వక్తలు మాట్లాడుతూ ఐటీఐ మంజూరై 16 ఏళ్ళు గడిచినా,స్థలం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో 5 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ స్థలం లేకపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లాయని,ప్రస్తుతం ఉన్నతీకరణకు కేంద్రం రూ.40 కోట్ల నిధులు కేటాయించినట్లు సమాచారం ఉందన్నారు. స్థలం కేటాయించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.