
జిఎంఆర్ కేర్ హాస్పిటల్ పౌష్టికాహారం పంపిణీ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని జీఎంఆర్ కేర్ హాస్పిటల్ నందు ఈ రోజు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ప్రధాన మంత్రి వి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా ఏబీ ఆసుపత్రి పరిధిలోని 150 మంది పేషెంట్లకు పోషకాహార ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మూడు నెలల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక్కో పేషెంట్‌కు నెలకు రూ.750/- విలువైన పోషకాహారం అందించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమాన్ని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ మరియు డాక్టర్ వరలక్ష్మి క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో
జిల్లా వైద్యాధికారి డా. జీవన్ రాణి గారు,
అదనపు జిల్లా వైద్యాధికారిణి డా. రాణి గారు,
వైద్యాధికారి డా. జగ్గవి,
జీఎంఆర్ సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ శ్రీ జయకుమార్ గారు,
ఆసుపత్రి సంచాలకులు డా. రఘునాథ్ గారు
తో పాటు వైద్యులు, నర్సులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు, పేద మరియు అవసరమైన రోగులకు ఇలాంటి పోషకాహార సహాయం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.