logo

నేడు భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

AIMA న్యూస్ బ్యూరో.రాయలసీమ ప్రాంతం లో ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి ఒక బలమైన ముద్ర వేసిన నాయకుడు. ఆళ్లగడ్డ ప్రాంతం అంటేనే భూమా కుటుంబం గుర్తుకు వచ్చేలా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన భూమా నాగిరెడ్డి. ఆయన 1964, జనవరి 8న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కొత్తపల్లె గ్రామంలో జన్మించారు. భార్య భూమా శోభా నాగిరెడ్డి. వీరికి ముగ్గురు పిల్లలు (అఖిలప్రియ, మౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డి). శోభా నాగిరెడ్డి కూడా ప్రముఖ రాజకీయ నాయకురాలు. భూమా నాగిరెడ్డి రాజకీయం గడ్డు పరిస్థితుల్లో మొదలైంది. ఆయన సోదరుడు భూమా శేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.ఎమ్మెల్యేగా ఆయన మొదటిసారి 1992 ఉప ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పలుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుపై పోటీ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత 1998, 1999 మరియు 2004 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలుపొందారు.
చాలా కాలం తెలుగుదేశం పార్టీ (TDP) లో కొనసాగారు.తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరి, 2014లో ఆళ్లగడ్డనుండి ఎమ్మెల్యేగాగెలిచారు.తిరిగి2016లో తెలుగుదేశంపార్టీలోకి వెళ్లారు.
ఆళ్లగడ్డ మరియు నంద్యాల ప్రాంతాల్లో భూమా కుటుంబానికి భారీ అనుచర గణం ఉండడంతో. ఈ ప్రాంతంలో ఆయన ఒక శక్తివంతమైన నాయకుడిగా పరిగణించేవారు.ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచిన కాలంలో తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి అండగా ఉండేవారని ఆయన అనుచరులు చెబుతుంటారు.
భూమా నాగిరెడ్డి 2017, మార్చి12న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. ఆయన మరణానంతరం కుమార్తె భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న భూమా అఖిల ప్రియ

166
5113 views