logo

మార్లవాయి అభివృద్ధికి రూ.91.20 లక్షలు మంజూరు.. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కృషి విజయవంతం !


చరిత్రాత్మక మార్లవాయి గ్రామ ప్రగతికి పచ్చజెండా ఊగింది . ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కృషి ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.91.20 లక్షల నిధులు మంజూరు చేశారు.
గత ప్రభుత్వ హయంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ఆదర్శ గ్రామాన్ని మార్లవాయి మళ్లీ ప్రగతి పథంలో నడిపించడమే ఎమ్మెల్యే లక్ష్యం. జైనూర్ మండలంలోని ఈ గ్రామాన్ని మంత్రి ని తీసుకెళ్లి పరిస్థితులు వివరించిన ఎమ్మెల్యే, ఆ రాత్రి అక్కడే బస చేసి స్థానిక సమస్యలను అధికారులకు చాటారు.
అక్కడ దశాబ్దాలుగా నివసించిన ఆస్ట్రియన్ ఆంథ్రోపాలజిస్ట్ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, భార్య బెట్టీ ఎలిజబెత్ ఆదివాసీల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తుంచేందుకు వారి కాంస్య విగ్రహాల ప్రతిష్ఠాపన, స్మృతి వనం ఏర్పాటుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. గ్రామ రోడ్ల మరమ్మత్తు, ఇతర అవసరాలకు కూడా ఇది మార్గం సుగమం చేస్తుంది. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఈ కృషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి జూపల్లి కృష్ణారావు చూపిన సానుకూల స్పందనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

5
963 views