
ఉత్సాహంగా సాగిన ఉత్తరాంధ్ర ఫుట్ బాల్ టోర్నమెంట్: విజేతలకు బహుమతులు అందజేసిన సిరమ్మ...
విజయనగరం, జనవరి 07:
నగరంలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ఫుట్ బాల్ టోర్నమెంట్ బుధవారంతో ఘనంగా ముగిసింది. డాక్టర్ చిట్టివైష్ణవ ట్రస్ట్ ఆధ్వర్యంలో, డాక్టర్ చిట్టి రమణరావు ప్రోత్సాహంతో, మాజీ క్రీడాకారుడు బుర్లి రామారావు స్మారకార్థం నిర్వహించిన ఈ పోటీల ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా సిరమ్మ. (చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు) హాజరయ్యారు.
బూర్లి రవీంద్ర ఆహ్వానం మేరకు ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
క్రీడలతోనే మానసిక ఉల్లాసం
ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుట్ బాల్ క్రీడ వల్ల దేహదారుఢ్యం పెరుగుతుందని, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆటకు భారతదేశానికి మంచి గుర్తింపు ఉందన్నారు. భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు పుట్టుకురావాలని, ఫుట్ బాల్ క్రీడను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు.
విజేతల ప్రకటన - బహుమతుల ప్రదానం
ముగింపు వేడుకల్లో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో విన్నర్ గా ఎస్.కె.ఎం.ఎ ల్, రన్నర్ గా శబరి టీమ్ లకు సిరమ్మ బహుమతులు అందజేశారు. క్రీడాకారులు ప్రదర్శించిన నైపుణ్యాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
పాల్గొన్న ముఖ్యులు:
ఈ కార్యక్రమంలో డి. ఎఫ్. ఎ. ప్రెసిడెంట్ డి. వి. రజినీ కుమార్, జి . సన్యాసయ్య, బూర్లి రవీంద్ర, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఫుట్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.