logo

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం... అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసుల కఠిన చర్యలు

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం...
అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసుల కఠిన చర్యలు

మునిమడుగు గ్రామంలో కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించిన పెనుగొండ పోలీసులు..

డిఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు...పెనుగొండ మండలంలోని సమస్యాత్మక గ్రామమైన మునిమడుగులో బుధవారం ఉదయం కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ను పెనుగొండ పోలీసులు నిర్వహించారు.

డి.ఎస్.పి తో పాటు,
నలుగురు సిఐలు,
12 మంది ఎస్ఐలు.
మొత్తం 150 మంది సిబ్బందితో
పెనుగొండ డీఎస్పీ నర్సింగప్ప గారు నేతృత్వంలో ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించారు.
నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా తనిఖీలు
గ్రామంలో నేరాలను పూర్తిగా నియంత్రించడం, శాంతి భద్రతలను పరిరక్షించడం, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం ప్రధాన లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామంలోని అనుమానిత ఇళ్లను, రౌడీషీటర్స్ ట్రబుల్ మాంగర్స్ నివాసాలను గడ్డివాములను తనిఖీలు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.
లైసెన్స్ లేని 28 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలను సీజ్ చేశారు.

డీఎస్పీ శ్రీ నర్సింగప్ప గారు మాట్లాడుతూ..
గ్రామంలో గ్రామసభ నిర్వహించి ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించి, శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. మహిళా నేరాలు సైబర్ మోసాలు, పోక్సో కేసులు, కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. నేరాలకు పాల్పడే వారికి హెచ్చరికగా ఇలాంటి కార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు పాత నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ సత్ప్రవర్తనతో నడుచుకోవాలని సూచించారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించాలని డిఎస్పి గారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పెనుగొండ డీఎస్పీ నర్సింగప్ప , సీఐ లు శ్రీ రాఘవన్, శేఖర్ రాజ్ కుమార్ ,సుబ్రహ్మణ్యం, ఎస్సైలు వెంకటేశ్వర్లు, రవికుమార్, రాజేష్, శోభారాణి, ఏఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు తదితరులు పాల్గొన్నరు.
S.SatheeshKumar IPS

6
302 views