
వెనిజులాలో ఉద్రిక్తతలు.. యూఎస్ నుంచి చమురు నౌకలను రక్షించడానికి రష్యా జలాంతర్గామి ఎంట్రీ!
వెనిజులా తీరం వెంబడి చమురు ట్యాంకర్‌కు రక్షణగా రష్యా జలాంతర్గామి, ఇతర నావికా దళాలను పంపింది. ఇది అమెరికా-రష్యా సంబంధాలలో కొత్త సంచలనంగా మారిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది
రష్యా సబ్‌మరీన్‌తో పాటు మరికొన్ని నౌకలను పంపిందన్న వార్తలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. 'బెల్లా 1' అనే పేరుతో ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ వెనిజువెలాలో చమురు లోడ్ చేయడంలో విఫలమైంది. ప్రస్తుతం రష్యా వైపు ప్రయాణిస్తోంది. గత రెండు వారాలుగా అట్లాంటిక్ సముద్రంలో అమెరికా కోస్ట్ గార్డ్ ఈ నౌకను వెంబడిస్తోంది. అమెరికా అభిప్రాయం ప్రకారం.. రష్యా ఆంక్షలు తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న 'డార్క్ ఫ్లీట్'లో ఈ నౌక భాగం. ఈ ఫ్లీట్ ద్వారా అక్రమంగా చమురు రవాణా జరుగుతోందని అమెరికా చెబుతోంది. డిసెంబర్‌లో ఈ ట్యాంకర్‌ను అదుపులోకి తీసుకునే అమెరికా ప్రయత్నం చేసింది. కానీ నౌక సిబ్బంది దాన్ని అడ్డుకున్నారు.
READ MORE: WhatsApp Scam: వాట్సాప్ కాల్‌తో కోటిన్నర రూపాయలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు..
వెంబడించేటప్పుడు సిబ్బంది నౌకపై రష్యా జెండా వేశారు. అలాగే 'మరినెరా'గా పేరు మార్చారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన పరిశీలన లేకుండానే రష్యా ఈ నౌకకు రిజిస్ట్రేషన్ ఇచ్చింది. దాంతో అంతర్జాతీయ చట్టాల ప్రకారం దీనికి రక్షణ లభిస్తోంది. ఈ ట్యాంకర్ వెంబడించడం ఆపాలని రష్యా అమెరికాను డిమాండ్ చేసింది. రష్యా విదేశాంగ శాఖ ఈ నౌక పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నామని తెలిపింది. మరోవైపు, అమెరికా సైన్యం సౌత్ కమాండ్ ఈ ప్రాంతం గుండా వెళ్లే ఆంక్షల నౌకలపై చర్యలకు సిద్ధంగా ఉన్నామని సోషల్ మీడియాలో పేర్కొంది.
READ MORE: Jaishankar-Venezuela: మదురో కిడ్నాప్‌పై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఈ ట్యాంకర్ ఐస్లాండ్‌కు దక్షిణంగా సుమారు 300 మైళ్ల దూరంలో ఉత్తర సముద్రం వైపు సాగుతోంది. రష్యా ప్రభుత్వ మీడియా ఆర్టీ విడుదల చేసిన వీడియోలో ఒక పౌర నౌకను అమెరికా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఈ వివాదం ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో జరుగుతున్న అమెరికా-రష్యా దౌత్య చర్చల సమయంలోనే ఉద్భవించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రష్యాపై విధించిన ఆంక్షల తర్వాత వెయ్యికి పైగా పాత ట్యాంకర్లతో ఒక డార్క్ ఫ్లీట్(డార్క్ ఫ్లీట్ (Dark Fleet) అంటే అంతర్జాతీయ నిబంధనలను తప్పించుకోవడానికి, అక్రమ కార్యకలాపాలకు (స్మగ్లింగ్, అక్రమ చేపల వేట, వ్యర్థాలను పారవేయడం వంటివి) ఉపయోగించే ఓడల రహస్య సమూహం) ఏర్పడింది. ఇవి బీమా లేకుండా అక్రమంగా చమురు సరఫరా చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ ఫ్లీట్‌కు చెందిన స్కిప్పర్, సెంచురీస్ అనే రెండు పెద్ద నౌకలను అమెరికా స్వాధీనం చేసుకుంది.