వెన్న ముద్దల అలంకారంలో రాజగోపాల్ స్వామి: కొత్తపేటలో ధనుర్మాస శోభ!
విజయనగరంలోని కొత్తపేటలో కొలువై ఉన్న శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస సందర్భంగా శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామివారికి నవనీతంతో అలంకరించారు. వేకుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ఆలయ పూజారి ఫణిహారం మణిబాబు మాట్లాడుతూ.. ఈ నెల 14 తేదీ వరకు ధనుర్మాస వ్రత మహోత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులు హజరై స్వామివారి కరుణాకటాక్షాలకు పాత్రులు కాగలరని అన్నారు.