logo

15 మండలాలతో కల్వకుర్తి ని జిల్లా చేయాలి.

కల్వకుర్తి....
కలువ పువ్వులకు నిలయమైనది.

ఈ మట్టి పవిత్రము ...
ఈ గాలి విచిత్రము...
ఈ నేల మహాత్యము ...
ఇక్కడి ప్రజల మనసు
విశాల హృదయం

మాది కల్వకుర్తి ప్రాంతం
మేము కల్వకుర్తి ప్రాంత
ముద్దు బిడ్డలం
భిన్న మతాలకు
విభిన్న ఆచారాలకు
సాంప్రదాయాలకు నిలయమై
సకల రాజవంశాలచే
సక్కగా పరిపాలించబడిన
పవిత్రమైన ప్రాంతం
మన కల్వకుర్తి.

స్వాతంత్ర్య సమరయోధులు
కవులు,కళాకారులు
వాగ్గేయకారులు
ఉద్యమకారులు
శాస్త్రవేత్తలు,చరిత్రకారులు
ఉద్దండ రాజకీయ నేతలు
క్రీడాకారులు
భక్తి సేవా తత్పరులకు
మన కల్వకుర్తి పుట్టినిల్లు.

స్వాతంత్ర్య పోరాటాలు
సాయుధ రైతాంగ పోరాటాలు
తెలంగాణ విద్యార్థి ఉద్యమం
కరువు వ్యతిరేక పోరాటాలు
మలిదశ తెలంగాణ ఉద్యమాలు
ఆర్డిఓ సాధన ఉద్యమం
కేఎల్ఐ నీళ్ల పోరాటాలు
సామాజిక ఉద్యమాలతో
కల్వకుర్తి ప్రాంతం చైతన్యం పొందింది.
జిల్లా కావలసిన లక్షణాలు:-

1) విద్య,వైద్యరంగాల్లో అభివృద్ధి.
2) శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధతో ఉంటుంది.
3) వ్యవసాయ రంగంలో
నిత్య నూతన అభివృద్ధి.
4) 3 జాతీయ రహదారులను కలిపే కూడలిగా కల్వకుర్తి కలదు.
5) హైదరాబాదు నుండి శ్రీశైలం
హైదరాబాదు నుండి తిరుపతి
కోదాడ నుండి రాయచూర్ వెళ్లే జాతీయ రహదారులు కల్వకుర్తి పట్టణ కేంద్రంగా వెళుతున్నాయి.
6) మూడు రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ నేషనల్ హైవే కనెక్టివిటీ కలదు.
7) రీజినల్ రింగ్ రోడ్డు రోడ్ కు అతి దగ్గరలో కల్వకుర్తి పట్టణం కలదు.
8) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏర్ పోర్టుకు 70 కిలోమీటర్ల దూరంలో కల్వకుర్తి పట్టణం కలదు.
8) భవిష్యత్తులో మీ పిల్లలు ఉన్నత ఉద్యోగాలు,వర్తక వాణిజ్యాలకై విదేశాలకు వెళ్లి వచ్చేందుకు చక్కటి అవకాశం కలదు.
9) కల్మషం లేని రాజకీయ నాయకులు
అభివృద్ధి కోసం పాటుపడే ఉద్యమకారులు
ఇతరుల మేలుకోరే ప్రజలు ఈ ప్రాంతంలో కలరు.
10) సీనియర్ జూనియర్ కోర్టులు కలవు.
ఇలా బహుముఖ రంగాల్లో
కల్వకుర్తి అభివృద్ధి పథంలో
ముందుకు సాగుతుంది.
అలాంటి కల్వకుర్తిని జిల్లా చేయాలి.

కల్వకుర్తి తాలూకాను
జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి.

1) కల్వకుర్తి
2) వెల్దండ
3) ఆమనగల్లు
4) తలకొండపల్లి
5) మాడ్గుల్
6) కడ్తాల్
7) వంగూరు
8) చారకొండ
9) మిడ్జీల్
10) ఊరుకొండ
11) కేశంపేట్

ఈ 11మండలాలకు తోడుగా
వెల్జాల్ మండలం
ఇర్విన్ మండలం
రఘుపతిపేట మండలం
గట్టిఇప్పలపల్లి మండలం గా మార్చాలి.

అలాగే డిండి మండలానికి చెందిన
కొంత భాగాన్ని కలుపుకొని
15 మండలాలకు కేంద్రంగా
కల్వకుర్తి జిల్లా గా ఏర్పాటు చేయాలి.

గతంలో...
6 మండలాలతో జిల్లా చేశారు.
7 మండలాలతో జిల్లా చేశారు.
8 మండలాలతో జిల్లా చేశారు
9 మండలాలతో జిల్లా చేశారు.
ఇప్పుడు...
15 మండలాలతో ...
కల్వకుర్తి జిల్లా చేయండి
ఇది న్యాయబద్దమైన కోరికనే
ఇది అందరికీ సమంజసమే
మేధావులు,విద్యావంతులు
లెక్చరర్స్,అడ్వకేట్స్,
ఉద్యోగులు,జర్నలిస్టులు
వాణిజ్య వ్యాపారస్తులు
వివిధ రాజకీయ పార్టీలు
ప్రజాప్రతినిధులు
యువకులు,రైతులు, మహిళలు
సామాన్య ప్రజలు
ముక్తకంఠంతో కోరుతున్నారు.


అలాగే మీ సూచనలు
అభిప్రాయాలు తెలపండి ధన్యవాదాలతో....

కల్వకుర్తి జిల్లా సాధన జేఏసి
అయిల్ సదానందం గౌడు
జేఏసి చైర్మన్ కల్వకుర్తి
9704125784

86
7794 views