logo

భోగాపురం ఎయిర్‌పోర్ట్ జగనన్న విజన్.. క్రెడిట్ చోరీకి టీడీపీ ప్రయత్నం సిగ్గుచేటు: చిన్న శ్రీను


భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రతిపక్ష టీడీపీ చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని, ప్రాజెక్టు క్రెడిట్‌ను దొంగిలించేందుకు పచ్చ ముఠా పడుతున్న తాపత్రయం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను ధ్వజమెత్తారు. మంగళవారం ధర్మపురిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పత్రికా సమావేశంలోని ముఖ్యాంశాలు:
* బాబు లక్ష్యం భూదందా - జగన్ లక్ష్యం అభివృద్ధి: గతంలో చంద్రబాబు నాయుడు ఎయిర్‌పోర్ట్ పేరుతో వేలాది ఎకరాల భూములను కొట్టేయాలని చూశారని చిన్న శ్రీను విమర్శించారు. అమరావతి, హైటెక్ సిటీ తరహాలోనే ఇక్కడ కూడా 15,000 ఎకరాలను సేకరించాలని ప్రయత్నించి రైతులను ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. ఆనాడు రైతుల పక్షాన నిలబడి వైఎస్ జగన్ చేసిన పోరాటం వల్లే బాబు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని తెలిపారు.
* జగనన్న కృషితోనే రన్‌వేపై విమానం: భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన కృషితోనే ఈరోజు రన్‌వేపై ఫ్లైట్ ల్యాండ్ కాగలిగిందని చిన్న శ్రీను పేర్కొన్నారు. ఈ విజయం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ గర్వకారణమని, ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందని అన్నారు.
* పబ్లిసిటీ పిచ్చి - టెంకాయల రాజకీయం: 2019 ఎన్నికలకు ముందు ఎక్కడ టెంకాయ కొట్టారో కూడా తెలియని పరిస్థితిలో టీడీపీ నాయకులు ఉన్నారని, కేవలం పబ్లిసిటీ కోసం అప్పట్లో జిమ్మిక్కులు చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం 2,200 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించి, భూసేకరణ, ఎన్ఓసీ , కోర్టు కేసులు మరియు పరిహారం వంటి అన్ని అడ్డంకులను తొలగించారని వివరించారు.
* క్రెడిట్ చోరీని అడ్డుకున్న సోషల్ మీడియా: వైఎస్ జగన్ చేసిన కృషిని తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ చూస్తోందని, అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దాటికి వారి 'క్రెడిట్ చోరీ' ప్రయత్నాలు ఫలించలేదని ఆయన పేర్కొన్నారు.
* 2026 లక్ష్యంగా పనులు: జిఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, 2026 నాటికి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా జిఎంఆర్ అధినేత కూడా స్పష్టం చేశారని గుర్తు చేశారు.
* జిఎంఆర్ సంస్థకు ధన్యవాదాలు: అన్ని అనుమతులు తీసుకువచ్చి, ఉత్తరాంధ్ర తలరాతను మార్చే ఈ మహత్తర ప్రాజెక్టును పట్టాలెక్కించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధిని, ఇచ్చిన మాట ప్రకారం ఎయిర్‌పోర్ట్ పనులను సకాలంలో, వేగంగా పూర్తి చేస్తున్న జిఎంఆర్ సంస్థకు మరియు ఆ సంస్థ అధినేతకు ఈ సందర్భంగా చిన్న శ్రీను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో..
వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శులు కెవి సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్, మండలపార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ, పతివాడ అప్పలనాయుడు, గురువుగారు మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

0
56 views