logo

పాతపట్నం నియోజకవర్గంలో రూ 22.862 కోట్లతో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి

*▪️పాతపట్నం నియోజకవర్గంలో రూ.22.862 కోట్లతో 54 ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి - ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట....*

*▪️పాతపట్నంలో విస్తరిస్తున్న వైద్య మౌలిక వసతులు గౌ" శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి దూర దృష్టి – ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి కృషితో ఆరోగ్యాభివృద్ధి...*

*▪️నియోజకవర్గ ప్రజలకు చేరువలో నాణ్యమైన వైద్య సేవలు ఆరోగ్య సేవల బలోపేతానికి ఆరోగ్యమంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు నిధులు మంజూరు చేసిన మంత్రి వర్యులువారికి ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు...*

*▪️గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి సమగ్ర ఆరోగ్య దృష్టితో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా,ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సదుపాయాల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది.ఈ క్రమంలో పాతపట్నం నియోజకవర్గంలో ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువలో అందుబాటులో ఉండేలా పలు ఆసుపత్రుల భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది.నియోజకవర్గంలో మొత్తం రూ.22.862 కోట్ల వ్యయంతో కొత్తగా 54 ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.వీటిలో విలేజ్ హెల్త్ క్లినిక్స్, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్,ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల భవన నిర్మాణాలు ఉన్నాయి.ఈ నిర్మాణాలు పూర్తయిన అనంతరం స్థానిక ప్రజలకు మరింత మెరుగైన,నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఈ కీలకమైన ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ సత్య కుమార్ యాదవ్ గారికి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రధాన ధ్యేయమని, పాతపట్నం నియోజకవర్గాన్ని ఆరోగ్యపరంగా మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు తెలిపారు.*

0
57 views