logo

తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల్లో కూన రవికుమార్ గారి దిశ నిర్దేశం

AIMA న్యూస్ శ్రీకాకుళం :
👉తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీల కోసం నిర్వహించిన శిక్షణా తరగతులు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆమదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పి.యూ.సి ఛైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

👉ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాల లబ్ధి ప్రజలకు అందేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

👉ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, వాటిని ప్రజలకు వివరించగలిగే విధంగా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్రమశిక్షణతో పనిచేస్తే రానున్న కాలంలో మరింత ప్రజాభిమానం పొందగలమని కూన రవికుమార్ గారు తెలిపారు.

0
0 views