logo

*ఈనెల 11 న పారా (దివ్యాంగుల ) అథ్లెటిక్స్ పోటీలు :* *-పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దయానంద్*



పారా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఈనెల 11 (ఆదివారం) న స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నామని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. ఈమేరకు మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి లో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో అంతకు ముందుగా రాష్ట్ర స్థాయి పోటీల ఎంపిక కొరకు ఈ జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. 17 ఏళ్ళు నిండిన దివ్యాంగ క్రీడాకారులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత ఉంటుందని, రన్నింగ్, షాట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో క్రీడలు వుంటాయని అన్నారు. ఆశక్తి కలిగిన దివ్యాంగ క్రీడాకారులు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పాస్ ఫోటో, ఆధార్, సదరం సర్టిఫికెట్స్ తో పోటీలకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. ఇతర వివరాలు కొరకు 9849377577 నంబర్ ను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కె. ప్రసాద్, జాగరణ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

10
468 views