logo

గుంతల రహదారిగా మారిన నందిగామ–రామన్నపేట మార్గం… ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ నుండి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. HP పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ కంపెనీ నుంచి రామన్నపేట ఫ్లైఓవర్ వరకు… అలాగే GDMM కాలేజ్, ఉమా కాలనీ, కండ్రికఆంజనేయస్వామి గుడి మార్గంలో తారురోడ్డు కుంగిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోజూ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. గుంతల్లోకి వాహనాలు జారిపడి
బైకులు స్కిడ్ అవ్వడం,
ప్రమాదాలు జరగడం,పలువురు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందడం వంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాలు పడితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. నీటితో నిండిన గుంతలు డ్రైవర్లకు కనిపించకపోవడంతో ప్రమాదాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కావున నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండల కృష్ణకుమారి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యలను వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రోజూ వందలాది వాహనాలు వెళ్తున్న ఈ రహదారి ఎందుకు నిర్లక్ష్యానికి గురైందని వారు ప్రశ్నిస్తున్నారు.ప్రజల ఆరోగ్యం, రక్షణ దృష్ట్యా ఈ రోడ్డును త్వరితగతినపునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

5
175 views