పాతపట్నం నియోజకవర్గం సమగ్ర అభివృద్దే లక్ష్యం.. ఎమ్మెల్యే ఎంజీఆర్
AIMA న్యూస్ శ్రీకాకుళం :
*▪️పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఎర్ర చెరువు వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఎర్ర చెరువు అభివృద్ధి ద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. అలాగే మేజర్ పంచాయతీ పరిధిలో ఎర్ర చెరువు అభివృద్ధితో పాటు వాకర్స్ కోసం ట్రాక్ రోడ్డు ఏర్పాటు చేయడం ద్వారా ఉదయం,సాయంత్రం నడక చేసే వారికి మరియు చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు.ప్రజల ఆరోగ్యం, వినోదం, జీవన ప్రమాణాలు మెరుగుపడేలా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే గారు,పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.*