అహోబిలం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరణ.
నంద్యాల జిల్లా రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని అహోబిలం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గా శ్రీనివాసరెడ్డి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ముర్తు జావలి పదోన్నతిపై రుద్రవరం రేంజ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో ఆలమూరు సెక్షన్ ఆఫీసర్ మత్తర్ భాష ఇన్చార్జి డిప్యూటీ డేంజర్ గా పనిచేస్తున్నారు. ఫారెస్ట్ ఉన్నతాధికారులు నూతల సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డికి పదోన్నతి కల్పించి అహోబిలం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో శ్రీనివాసరెడ్డి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.