logo

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై రేవంత్ వ్యాఖ్యలను ఖండన చేసిన రాష్ట సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై రేవంత్ వ్యాఖ్యలను ఖండన చేసిన రాష్ట సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ”

తేది :05.01.2025
శ్రీ సత్య సాయి జిల్లా ,
పెనుకొండ నియోజకవర్గo , సోమందేపల్లి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం నందు సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ మరియు టీడీపీ మండల నాయకులతో కలసి పత్రిక సమావేశంంలో పాల్గొని మాట్లాడటం జరిగినది.ఈ సందర్భంగా మాట్లాడుతూ

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Irrigation Projects) పనులను తామే నిలిపివేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ తీవ్రంగా తప్పుపట్టినారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ పనులు ఆపినట్లు రేవంత్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పూర్తిగా అసంబద్ధమైనవిగా అభివర్ణించినారు.
చంద్రబాబు నాయుడు పేరును కేంద్రంగా చేసుకుని తెలంగాణలో అధికార, విపక్ష పార్టీలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నాయని చైర్మన్ ఆరోపించినారు. ప్రజా ప్రయోజనాలకన్నా రాజకీయ లబ్ధి కొరకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించినారు.
జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నాటి ప్రభుత్వం చేపట్టిందని వివరించినారు. సీమకు రోజుకు మూడు టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా మాజీ సీఎం జగన్ పనులు చేపట్టారని చెప్పుకొచ్చినారు.మాజీ సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందని చైర్మన్ పేర్కొన్నారు.కాగా,కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటి సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు చేసిందని గుర్తు చేసినారు. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనుల నిలిపివేసారని వివరించింది.2020లోనే ఈ మేరకు ఎన్టీటి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించినారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని తెలిపింది.చంద్రబాబు సెంటర్ గా తెలంగాణ లోని అధికార..విపక్షాలు రాజకీయాలు నడుపుతూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాయని చైర్మన్ పేర్కొన్నారు.అంతే కాకుండా హంద్రీనీవా కాలువ రాయలసీమ లోని ఉమ్మడి జిల్లాలు అయిన కర్నూలు,అనంతపురం,కడప,చిత్తూరు లోని కుప్పం ప్రాంతానికి కృష్ణ జలాలను తీసుకురావడం,ముఖ్యముగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం ఒక చారిత్రక ఘట్టం.దిన ద్వారా 6300 ఎకరాల ఆయకట్టుకు త్రాగునీరు,సాగు నీరు అందుతుంది.దశాబద్ధల నీటి కరువు తీరింది..అలగే తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ లోని కర్నూలు,చిత్తూరు,కడప మరియు నెల్లూరుంజిల్లాల కు 5.75 లక్షల ఎకరాలకు సాగు నీరు ,చెన్నై కి నగరానికి దాదాపు 15 టీ.యం.సి ల అందుతుంది.
నీటి హక్కులు, సాగునీటి ప్రయోజనాలపై ఎలాంటి రాజీ లేదు-చైర్మన్
రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి అవసరాలు, ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని రాష్ట సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ స్పష్టం చేసినారు. సీమ ప్రజల ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ఈ అంశంపై అవసరమైన అన్ని చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతీసుకొంటుంది అని *రాష్ట సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ తెలిపినారు.

14
244 views