
రోలుగుంట మండలంలోని కొవ్వూరు గ్రామంలో వికసిత్ భారత్ గ్రామ సభ
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కొవ్వూరు గ్రామంలో సోమవారం వికసిత్ భారత్ జి రాం జీ గ్రామ సభ ఉత్సాహంగా జరిగింది. గ్రామ అభివృద్ధి పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చలు ఈ సమావేశంలో జరిగాయి.గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో నాగేశ్వరరావు మాట్లాడుతూ, "ప్రతి గ్రామం స్వయం సమృద్ధి మార్గంలో నడవాలి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు ప్రజలకు చేరే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సమన్వయంతో పని చేయాలి" అని సూచించారు.రోలుగుంట ఎంపీపీ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “గ్రామ పచ్చదనం, స్వచ్ఛత, ఉపాధి హామీ పనులు, మహిళా సంక్షేమం వంటి అంశాలపై ప్రతి కుటుంబం పాల్గొంటే గ్రామవికాసం త్వరగా సాధ్యమవుతుంది” అని అన్నారు.గ్రామ సర్పంచ్ కాంతమ్మ మాట్లాడుతూ, “ప్రజల సహకారం మా బలం. గ్రామంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం మన ఇంటి పెరట్లో వేర్లు వేయాలి” అంటూ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.ఐటిడిపి ప్రెసిడెంట్ బంటు రాజు మాట్లాడుతూ, "గ్రామ స్థాయిలో వికాసం ప్రతి ఒక్కరి బాధ్యత. సామూహిక కృషితోనే కొవ్వూరు గ్రామం ఆదర్శ గ్రామంగా మారగలదు" కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క కార్యక్రమంలో 125 రోజుల వేతన ఉపాధి హామీ, గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక, శక్తివంతమైన నిరుద్యోగ భృతి ఏర్పాటు, వికసిద్ గ్రామపంచాయతీ ప్రణాళికలో అన్ని పథకాలు అనుసంధానం, నిర్ణీత సమయంలో చెల్లింపులు ఆలస్యానికి పరిహారం, సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతం. వంటి అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కార్యక్రమంలో అనుసంధానం చేశాయని , వీటిని ప్రెషర్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు , యువత, మహిళా సంఘ సభ్యులు, ఉపాధి హామీ పథకం వి ఆర్ పి. వై లక్ష్మి, పనిచేసే కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభ అనంతరం గ్రామంలో పలు సమస్యలపై చర్చించి పరిష్కార సూచనలు రూపొందించారు.