logo

"మోదీ పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం.. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కండి!"


మీరిచ్చిన ప్రతి రూపాయి కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వర్తకుళ హక్కుల కోసం పోరాడుతామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శంకర్రావు అన్నారు. ముఖ్యంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇద్దరు గుజరాత్ నాయకులు మోడీ, అమిత్ షా ఇద్దరు గుజరాత్ వ్యాపారస్తులు ఆదాని, అంబానీల కోసం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, అడవులు ప్రకృతి వనరులు అన్ని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచిపెడుతున్నారు. అడ్డు వచ్చిన వాళ్లను తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం మత విద్వేషాలు రెచ్చగొట్టడం లేదా చంపేయడం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి వెన్ను దోన్నుగా ఉన్న మీడియాను, న్యాయ వ్యవస్థను, పరిపాలన వ్యవస్థలను విధ్వంసం చేస్తూ మానవ హక్కులకు ప్రమాదకరంగా పరిపాలన సాగుతుందని అన్నారు. లేబర్ కోడ్స్ రద్దుచేసి కోట్లాదిమంది కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తుంది. కోట్లాదిమంది రైతాంగాన్ని భూమికి దూరం చేసే వ్యవసాయ చట్టాలు మారుస్తున్నది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి రాంజీ పథకంగా మార్చి ఏప్రిల్ నుండి ఉపాధి హామీని కుదిస్తున్నది. ఉపాధ హామీకి 90 శాతం కేంద్రం 10% రాష్ట్రం ఖర్చు పెట్టాల్సి ఉండగా మోడీ ప్రభుత్వం 60 శాతం కేంద్రం 40 శాతం రాష్ట్రాలు భరించాలని ఈ పథకాన్ని మార్చింది. రాష్ట్రాల మీద మోయలేని భారాన్ని మోపింది భవిష్యత్తులో ఉపాధి హామీ కూలీల సంఖ్య తగ్గుతాయని అన్నారు. బొబ్బిలి పట్టణంలో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ పెట్టడంతో వందలాది మంది చిన్న వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నది. ప్రభుత్వాల విధానాల వలన పేదరికంలోకి నెట్టబడుతున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరుగుతున్నది వీటన్నిటి పైన ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు శ్రమజీవులు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

0
296 views