logo

రోలుగుంట బిజెపిలో వర్గ పోరు పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకమా?

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గత కొంతకాలంగా అంతర్గత విభేదాలతో తల్లడిల్లుతోంది. మండల స్థాయిలో పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలు జరుగక పోవడం, నాయకుల మధ్య అనుమానాలు, అసహకారం పెరగడం వల్ల కార్యకర్తల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది.పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు పార్టిని బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. అయితే రోలుగుంట మండల పరిస్థితి మాత్రం విడివిడి దిశలో సాగుతోంది. ఇక్కడ నాయకత్వ లోపం, వర్గపోరు పార్టీకే నష్టం కలిగిస్తున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కార్యకర్తల లోపం మరియు అసమ్మతి మండలంస్థాయిలో ఉన్న పాత నాయకులు మరియు కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారిద్దరి మధ్య అనుసంధానం లేకపోవడమే ప్రధాన సమస్యగా చెబుతున్నారు. పలు సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్న ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి. అందువల్ల కార్యకర్తలు విభజించబడి, ఒక్కొక్కరు తమతమ దారులు పట్టిన పరిస్థితి కనిపిస్తోంది.స్థానిక ప్రజల అభిప్రాయమూ ఇదే బీజేపీ స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో లేరని, సమస్యలపై స్పందన లేదని వారు అంటున్నారు. దీనివల్ల పార్టీ బలహీనత స్పష్టమవుతుంది ప్రజలు, కార్యకర్తలు గట్టిగా చర్చించుకుంటున్నారు. సీనియర్ కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రోలుగుంట మండలంలో బీజేపీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం వర్గపోరు సమస్యను తొందరగా పరిష్కరించి, కార్యకర్తలను ఒకే వేదిక మీదకు తీసుకురావడం అత్యవసరం అని వారు సూచిస్తున్నారు.కేంద్రం మరియు రాష్ట్ర స్థాయి నాయకత్వం జోక్యం చేసుకుని మండలంలో సమావేశం నిర్వహించి, పార్టీ బలాన్ని పునరుద్ధరించాలని ఆశతో సీనియర్ నాయకులు ఎదురుచూస్తున్నారు. సమిష్టి కృషి ద్వారా మాత్రమే పార్టీకి పూర్వ వైభవం తిరిగి వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

10
642 views