logo

భారత్ ఉపాధి హామీ పథకం చట్టంపై కార్మికుల ఆందోళనలు గ్రామసభలో వినతిపత్రం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొంతలం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తెలుగుదేశం పార్టీ నాయకులు మచ్చి నూకరాజు వినతి పత్రం అందజేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్ – ఉపాధి, జీవనోపాధి హామీ మిషన్ (గ్రామీణ) చట్టం, 2025’ (VB–G RAM G)పై స్థానిక ఎంథీ జీఎన్ ఆర్ ఇగా కార్మికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని,. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్న కార్మికులు, ఈ కొత్త చట్టం వల్ల తమ ఉపాధి హక్కు, గ్రామ స్వయంపాలన దెబ్బతింటుందని ఆరోపిస్తూ APO, ఎంపీడీవోలకు వినతిపత్రం సమర్పించారు. నూకరాజు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇప్పటి MGNREGA చట్టం కింద పని పొందడం ఒక చట్టబద్ధ హక్కు కాగా, కొత్త VB–G RAM Gలో పని కల్పన ప్రభుత్వ నిర్ణయాధికారానికి లోబడి ఉండడం ఆ హక్కును బలహీనపరుస్తోందని పేర్కొన్నారు. బిల్లోని కొన్ని నిబంధనలు పని డిమాండ్ చేసుకునే వ్యవస్థను తగ్గించి, “స్కీమ్ ఇచ్చినాఇవ్వకపోయినా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది” అన్న స్థాయికి తీసుకెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.125 రోజుల హామీ… కానీ అనిశ్చితి కొత్త చట్టం ప్రకారం రూరల్ హౌస్‌హోల్డుకి సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ ఉందని కేంద్రం చెబుతోందని, కానీ అన్ని గ్రామాలకూ, అన్ని కుటుంబాలకూ ఇది తప్పనిసరి అని బిల్లులో స్పష్టంగా రాయలేదని కార్మికులు అభిప్రాయపడ్డారు. నిధులు ‘నార్మేటివ్ అలొకేషన్’ పేరుతో రాష్ట్రాల వారీగా కేంద్రం నిర్ణయించడంతో, డబ్బులు తక్కువైతే పని రోజులు కూడా తగ్గే ప్రమాదం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.విత్తనం కోతకాలంలో 60 రోజుల నిషేధంపై తీవ్ర వ్యతిరేకత చూపారు. VB–G RAM Gలో వ్యవసాయ విత్తనాలు వేసే, కోత కోసే పీక్ సీజన్‌లో 60 రోజులపాటు పబ్లిక్ వర్క్స్ నిలిపివేయాలని ప్రతిపాదన ఉండటంపై కార్మికులు మండిపడ్డారు. “మనకు ఎక్కువగా డబ్బు కావాల్సింది, ఖర్చులు పెరిగేది అదే సీజన్‌లోనే… అప్పుడే పనులు ఆపేస్తే మా ఇంటి పరిస్థితి ఎలా?” అని గ్రామసభలో పలువురు ప్రశ్నించారు.గ్రామసభ, పంచాయతీల పాత్ర తగ్గుతుందన్న గోగోళి ఇప్పటి వరకు ఎంథీ జీఎన్ ఆర్ ఇగా పనులు, ప్రాధాన్యతలు గ్రామసభలే నిర్ణయించేలా చట్టంలో ఉన్నప్పటికీ, కొత్త చట్టం కింద నిధుల కేటాయింపు, పనుల ఎంపిక అధికంగా కేంద్ర, రాష్ట్ర స్థాయి కమిటీల చేతుల్లోనే ఉంటుందని కార్మికులు పేర్కొన్నారు. “గ్రామసభ నిర్ణయాలే పేపర్ మీద ఉండి, అసలు నిర్ణయాలు పైనుండి వస్తే గ్రామ స్వయంపాలన ఎక్కడుంది?” అని స్థానిక నాయకులు ప్రశ్నించారు. బయోమెట్రిక్, యాప్ ఆధారిత డిజిటల్ హాజరు, ఆన్‌లైన్ ప్లానింగ్, పేమెంట్లు తప్పనిసరి అవుతుండడంతో పేదలపై భారం పెరిగిందని కార్మికులు తెలిపారు. స్మార్ట్‌ఫోన్, నెట్‌వర్క్ సదుపాయం లేని వృద్ధులు, మహిళలు ఇప్పటికే పనికి దూరమవుతున్నారని, ‘టెక్నాలజీ పేరుతో మిమ్మల్ని తొలగిస్తున్నారనే భావన కలుగుతోంద’ని వారు గ్రామసభలో వినిపించారు.“మా మీద ప్రభావం పడే చట్టం అయితే, ముందుగా మా మాట వినాలి” అంటూ కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. VB–G RAM G అమలుకు ముందు గ్రామస్థాయి లో విస్తృతంగా ప్రజాభిప్రాయం సేకరించి, MGNREGAలో ఉన్న ఉపాధి హక్కు, గ్రామసభ అధికారాలు ఏ మాత్రం తగ్గకుండా చట్టంలో స్పష్టమైన భద్రత కల్పించాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు.

19
1226 views