కడెం ఆయకట్టు సస్యశ్యామలం.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ !
ప్లాస్టిక్ వెస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పనులు ప్రారంభం !
యాసంగికి సకాలంలో నీరు అందించడంతో కడెం ఆయకట్టు సస్యశ్యామలం కానుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.
అదివారం కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు యాసంగి సీజన్ లో సకాలంలో పంటలను పండించాలన్నారు.
కడెం ప్రాజెక్టు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్ల 46 లక్షలు ఖర్చుతో ప్రాజెక్టు పూర్తిస్థాయి మరమ్మత్తులు చేసిందన్నారు. త్వరలో పూడికను తొలిగిస్తామని, రోడ్డుకు మరమత్తులు చేపడతామని పేర్కొన్నారు.
అనంతరం మండల కేంద్రంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పనులను టెంకాయ కోటి ప్రారంభించారు.
ఈ కార్యక్రమాలలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.