యాసంగికి పంటకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తాం.
రబీ పంటకు సదర్మాట్ బ్యారేజి నీటిని విడుదల చేసిన నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ .
రబీ పంటకు గాను సదర్మాట్ బ్యారేజీ నీటిని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సదర్మాట్ బ్యారేజీ క్రింద చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుందని, రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఈనెలలోనే సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి సదర్మాట్ కు చేయాల్సిన మరమ్మత్తులు, ఇతర నిర్ణయాలపై విన్నవిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.