రాజుపేటలో మేలుకొలుపు సమ్మేళనం
కోటవుట్ల మండలంరాజుపేటలో మేలుకొలుపు సమ్మేళనం జనవరి12న, చత్రపతి శివాజీ హిందూ సేన ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పంచమ వార్షికోత్సవం, మేలుకొలుపు సమ్మేళనం ఈ నెల 12వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు రాజుపేట గ్రామంలోని రామాలయం దగ్గర ఘనంగా నిర్వహించబడనుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్య శ్రీ శ్రవణ చైతన్యానంద చిన్న స్వామీజీ విచ్చేసి ఆశీర్వచనాలు అందించనున్నారు. కోటవురట్ల మండల పరిధిలోని ప్రతి గ్రామం నుంచి మేలుకొలుపు బృందాలు ఆ రోజు ఉదయం 6 గంటలకు రాజుపేటలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చేరి, అక్కడి నుండి స్వామీజీతో కలిసి రామాలయం వరకు శోభాయాత్రగా పాల్గొంటాయి.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు చత్రపతి శివాజీ హిందూ సేన కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు నక్కా సత్యనారాయణ అధ్యక్షులు, వేగి శివాజీ ఉపాధ్యక్షులు, శ్రీధరాల తేజ కార్యదర్శి, మడ్డు జోగిరాజు, కొత్తలంక నూకలక్ష్మి, సింగంపల్లి వెంకట స్వామి నాయుడు తదితర సభ్యులు పాల్గొన్నారు.