logo

"మరో శంషాబాద్‌లా భోగాపురం ఎయిర్‌పోర్ట్: 5 నెలల్లో మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. విశాఖకు మెట్రో అనుసంధానం!"


శంషాబాద్, ముంబాయి, బెంగళూరు ఎయిర్పోర్ట్ తరహాలో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్టు ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 4-5 నెలల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిరోపోర్టును అధికారికంగా ప్రారంభిస్తామని చెప్పారు.
విశాఖ-భోగాపురం మధ్య మెట్రో సర్వీస్ కోసం ప్రతిపాదించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనికి కేంద్రం అర్బన్ డెవలప్మెంట్ నుంచి అనుమతులు రావాల్సి ఉందని.. త్వరలోనే దీనిపై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఎయిర్ పోర్ట్ పూర్తయ్యే సమయానికి రోడ్డు మార్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. మూలపేట పోర్ట్కు సంబంధించి భూ సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించి పనులు ప్రారంభిస్తామన్నారు.

27
876 views