logo

బి ఎన్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి సిపిఎం ఆందోళన

రావికమతం మండలం దొండపూడి గ్రామం వద్ద బి.ఎన్. రోడ్డు దయనీయ స్థితిలో ఉండడంతో స్థానిక ప్రజల ఆగ్రహం ఉధృతమైంది. రహదారి గోతులు, గొయ్యిలతో నిండిపోయి ప్రయాణం కష్టంగా మారడంతో గ్రామస్థులు సహనాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం దొండపూడి వద్ద బి.ఎన్. రోడ్డుపై గోయ్యల్లో కూర్చొని దీక్ష చేపట్టారు.దీక్షలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు మాట్లాడుతూ "ప్రజలు ప్రతిరోజూ ఈ రహదారిపై ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. గర్భిణీలు గోతుల్లోనే ప్రసవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఇప్పటికీ రహదారి పనులు ప్రారంభించలేదు" అని అన్నారు.భారీ గ్రానైట్ లారీలు నిరంతరం రాకపోకలు సాగించడంతో వంతెనలు దెబ్బతిన్నాయని, బ్రిటిష్ కాలంలో నిర్మించిన పాత బ్రిడ్జిలు కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రభుత్వం, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్మెంట్ విభాగాలు అక్రమ లారీ రవాణాపై నిఘా పెట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతారు" అని హెచ్చరించారు.దీక్షలో సిపిఎం నాయకులు పాంగి చంద్రయ్య, వంతల వాసు, స్థానిక రైతులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కొంతమంది ప్రయాణికులు కూడా దీక్షకు మద్దతుగా నిలబడ్డారు. స్థానిక ప్రజల డిమాండ్ ఏకైకమైనది .

5
1020 views