"సుజల స్రవంతిపై స్పీడ్ పెంచిన మంత్రి: రైతులకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేపట్టాలని ఆదేశం"
విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆయకట్టు, కాలువల భూసేకరణ, సాంకేతిక అలైన్‌మెంట్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విడతలవారీగా భూసేకరణ చేపట్టడం వంటి అంశాలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.