logo

కుబీర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి, ఎస్సై కృష్ణారెడ్డి.

Date:-04/01/2026,

ఈ రోజు కుబీర్ గ్రామంలో కీ.శే. కందూర్ నర్సప్ప మాజీ సర్పంచ్ జ్ఞాపకార్థకంగా కుబీర్ గ్రామ సర్పంచ్ కందూర్ సాయినాథ్ ఆధ్వర్యంలో యువకులతో క్రికెట్ టోర్నమెంట్ ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి,మాజీ ఎంపీపీ వడ్నం జ్యోతి నాగేశ్వర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సట్ల గంగాధర్, డాక్టర్ ప్యాట ప్రణయ్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రతినిధి,సామాజిక సేవకుడు డాక్టర్ సాప పండరి, విఠలేశ్వర మందిర ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోరేఖర్ కళ్యాణ్,పెంటాజి ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా రుక్మిణి విఠలేశ్వరుల ప్రతిమలకు పూజలు నిర్వహించి, ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి, ఎస్సై కృష్ణారెడ్డి పలువురి సమక్షంలో టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి మాట్లాడుతూ యువకులు గ్రౌండ్ లెవెల్ క్రీడలు ఆడుతూ శారీరకంగా, మానసికంగా పరిపక్వత చెందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుబీర్ గ్రామ ఉపసర్పంచ్ సూది గంగాధర్, కే సంతోష్. నారడీ మల్లేష్, కనకయ్య, యువ క్రీడాకారులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి, ఎస్సై కృష్ణారెడ్డి తొలుత బ్యాటింగ్ చేసి చక్కని ఆటను కనబరిచి మంత్రముగ్ధులను చేశారు

7
2669 views