logo

కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలుగా ఎన్.డి. విజయ్ జ్యోతి*

*కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలుగా ఎన్.డి. విజయ్ జ్యోతి*
   
కాంగ్రెస్ పార్టీ రెండవసారి కడప జిల్లా అధ్యక్షురాలుగా ఎన్. డి. విజయ్ జ్యోతి ను నియమించారు. శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అధ్యక్షురాలుగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ చురుకుగా ఉంటూ, తనదైన ముద్ర వేసుకున్న ఎన్ డి. విజయ జ్యోతి ని నియమించడం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయ జ్యోతి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్, రాష్ట్ర అధ్యక్షులు వైయస్ షర్మిల రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనపై పెట్టిన బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తానని చెప్పారు. పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల పక్షాన నిలబడి పోరాడతానని చెప్పారు. జిల్లా అధ్యక్ష పదవి రావడం మరోసారి బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.

3
106 views