logo

మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం. మహిళా విద్యా ప్రధానిని - సావిత్రి భాయి ఫూలే జయంతి వేడుకలు

గాజువాక(వడ్లపూడ)



87 వార్డు పాత వడ్లపూడి అంబేద్కర్ పార్కు లో,మహిళా విద్యా ప్రధానిని శ్రీమతి సావిత్రి భాయి ఫూలే* 195వ జయంతి సందర్బంగా, సావిత్రి భాయి ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని,కేక్ కట్ చేసారు.

కోమటి రమాదేవి మీడియాతో మాట్లాడుతూ సమాజంలో నిజమైన పేదరికం అజ్ఞానమని, అజ్ఞానాన్ని రూపుమాపటానికి చదువు ఒక్కటే మార్గమని అన్నారు.

సావిత్రి భాయి ఫూలే మహిళల చదువుకోవాలని దేశంలో మొదటి సారిగా మహిళల కోసం పాఠశాలలు నిర్మించి,మొదటి మహిళా ఉపధ్యాయురాలిగా,మహిళా విద్యా ప్రధాతగా చరిత్రలో నిలిచిపోయారాని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోమటి రమాదేవి,గాలి రవణమ్మ, పట్నాల దేవి,మజ్జి పుష్ప కుమారి, ఉషారాణి మచ్చ హేమ,గాలి నూకరాజు,గాలి నూకరత్నం,పట్నాల అప్పారావు,మైలవరపు తవిటయ్య, పార్వతి,గంగమ్మ,నాగలక్ష్మి, సరోజినీ,ఇమాన్యూల్, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

0
35 views