logo

కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి...

విశాఖపట్నం (మద్దిలపాలెం )


భారతదేశపు తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే పనిచేశారు.స్త్రీలకు అక్షరజ్ఞానం ఎందుకు ఉండాలి? వారు చదువుకుంటే సమాజం ఏ విధంగా బాగుపడుతుంది? అనే విషయాలపై ఉద్యమం కూడా చేశారు.ఆమె బోధనలు చేశారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.విజయబాబు అన్నారు.మన దేశంలో అత్యంత శక్తివంతమైన సంస్కర్తలలో సావిత్రిబాయి పూలే ఒకరు.ఈమె విద్యావేత్త, కవయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి డాక్టర్ వి సూర్యనారాయణ ఆవిడ సేవలను కొనియాడారు.మహిళల జీవితంలో గణనీయమైన మార్పులు రావాలని ఆమె ఉద్యమాలు చేశారని నాటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై పోరాటాలు చేశారని సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం వల్లే నేడు మహిళలు అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.కుసుమకుమారి అన్నారు.
సమాజంలో అసమానతలను రూపుమాపడానికి సావిత్రిబాయి పూలే విశేషంగా కృషి చేశారని డాక్టర్ పి.జయ అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ సుభాషిని,పి.ధనలక్ష్మి, డాక్టర్ జి.వి.ప్రతాప్,డాక్టర్ పి. ఉమామహేశ్వరరావు,డాక్టర్ పి గోపాల్ నాయుడు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

11
1336 views