భోగాపురం విమానాశ్రయంలో రేపే తొలి విమానం ల్యాండింగ్: ట్రయల్ రన్‌కు సర్వం సిద్ధం!
భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గగన విహార ముహూర్తం ఖరారైంది. ఆదివారం ట్రయల్ రన్ ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా తొలి విమానం భోగాపురంలో ల్యాండ్ కానుంది. ఆ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. ట్రయల్ రన్ విజయవంతమైతే మే నెల నుంచే సాధారణ విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టనున్నారు.