*తెంటు చంద్రమౌళి మెమోరియల్ మల్లంపేట ప్రీమియం లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీనాయన...*
శాసనసభ్యులు*ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* (బేబీ నాయన) గారి వీరాభిమాని, తెలుగుదేశం పార్టీ ముఖ్యకార్యకర్త * తెంటు చంద్రమౌళి* గత సంవత్సరం జూన్ నెలలో రోడ్డు ప్రమాదంలో స్వర్గస్తులైనారు.. వారి జ్ఞాపకార్థం మల్లమ్మపేట యువత *"తెంటు చంద్రమౌళి మెమోరియల్ మల్లంపేట ప్రీమియం లీగ్"* ను ఏర్పాటు చేయడం జరిగింది..ఈరోజు ఉదయం గౌరవ ఎమ్మెల్యే బేబీనాయన ఈ పోటీలను ప్రారంభించారు..సుమారు 30 జట్లు ఈ పోటీలో పాల్గొంటాయని నిర్వాహకులు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ, తనకు ఎంతో ఆప్తుడైన చంద్రమౌళిని కోల్పోవడం బాధాకరమని, పార్టీ కార్యక్రమాలైనా, ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలైనా తానే దగ్గరుండి చూసుకునేవాడని గుర్తుచేసుకుని బాధపడ్డారు.