logo

పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

పేద ప్రజలకు ఆపన్నహస్తంగా సీఎం సహాయనిధి నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో పేదవారికీ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆమె పేర్కొన్నారు.
నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని తమ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మొత్తం రూ.19,26,958/- (పంతొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు) మంజూరు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లబ్ధిదారులకు నేరుగా చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఒక పెద్ద భరోసాగా మారిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, వివిధ హోదాల రాష్ట్ర డైరెక్టర్లు, కూటమి నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

0
0 views