logo

కడప నగర అడిషనల్ కమిషనర్ కె. *రాకేష్ చంద్ర* గారిని కలిసిన జనసేన నాయకులు *పత్తి విశ్వనాథ్* గారు.

కడప నగర అడిషనల్ కమిషనర్ కె. *రాకేష్ చంద్ర* గారిని కలిసిన జనసేన నాయకులు *పత్తి విశ్వనాథ్* గారు.


ఈ రోజు కడప నగర అడిషనల్ కమిషనర్ శ్రీ కె. రాకేష్ చంద్ర గారిని జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శ్రీ పత్తి విశ్వనాథ్ గారు కడప నగరంలోని 16,17,18 19, 20, 21 డివిజన్ లకు సంబంధించిన పలు ప్రజా సమస్యలపై వినతి పత్రాన్ని కమిషనర్ గారికి అందజేశారు.

డివిజన్లలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను అడిషనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి, కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపడం అభినందనీయమని పత్తి విశ్వనాథ్ గారు తెలిపారు. మిగిలిన సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని అడిషనల్ కమిషనర్ గారు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జి.టి. కుమార్, అనిల్ వర్మ, పుల్లూరు ఖలీల్ భాష పాల్గొన్నారు.

జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పోరాడుతుందని, ప్రజలకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా పత్తి విశ్వనాథ్ గారు స్పష్టం చేశారు.

8
1074 views