logo

బాధిత కుటుంబాలకు అండగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను): పలువురి మృతి పట్ల పరామర్శ


విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) శనివారం పలు విషాద బాధిత కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చారు.
ముందుగా, చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి పచ్చిపల్లి కుమార్ తల్లి రాములమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న చిన్న శ్రీను వారి స్వగ్రామానికి వెళ్లి, రాములమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పుత్ర శోకంతో ఉన్న కుమార్ ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం, బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం కోడూరు గ్రామానికి చేరుకున్న చిన్న శ్రీను, అక్కడ మాజీ ఎంపీటీసీ తెంటు నారాయణరావు సతీమణి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో...
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి. సూర్యనారాయణ రాజు, శంబంగి వేణు, ఎంపీపీ ప్రతినిధి మీసాల విశ్వేశ్వరరావు, వల్లి రెడ్డి లక్ష్మణ్, ముళ్ళు రాంబాబు, జడ్పీటీసీ రామారావు, ఎంపీపీ గౌరీ, మండల పార్టీ ప్రెసిడెంట్ శివప్రసాద్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ మరియు ఇతర ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

19
904 views