logo

అభ్యుదయ ప్రోగ్రామ్‌తో గంజాయి నిర్మూలనపై పోరాటం వేగవంతం.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి. శ్రీ గోపినాథ్ ఐపీఎస్ ఆలోచనతో గంజాయి నిర్మూలనలో ‘అభ్యుదయ ప్రోగ్రాం’ అద్భుత ఫలితాలు ఇస్తోంది. పాయకరావుపేట లో 11వ తేదీన హోం మంత్రి వంగలపూడి అనిత సైకిల్ యాత్రతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 52 రోజులపాటు 1,000 కి.మీ. దూరం ప్రయాణించి లక్షలాది మందికి అవగాహన కల్పించింది.వైజాగ్ రేంజ్‌లో 2025 సంవత్సరం గంజాయి పోరాటంలో 129 కేసులు నమోదై, 423 మంది నిందితులను అరెస్టు చేశారు. 8,864 కేజీల గంజాయి, 118 వాహనాలు, 7 లీటర్ల లిక్విడ్ గంజాయి సీజ్ చేయబడ్డాయి. అనకాపల్లి జిల్లాలో ప్రత్యేకంగా 5 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రవాణాను అరికట్టారు.అవగాహన కార్యక్రమాల విస్తృతిఅభ్యుదయ ప్రోగ్రామ్‌లో 5,032 అవగాహన కార్యక్రమాలు జరిగాయి. వీటిలో 1,68,000 మంది విద్యార్థులు, 1,22,623 మంది గ్రామీణ ప్రజలు పాల్గొని గంజాయి దుష్ప్రభావాలను తెలుసుకున్నారు. డైనమిక్ చెక్‌పోస్టులు, డ్రోన్లు, సీసీ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌లతో పర్యవేక్షణ బలోపేతమైంది. శనివారం నర్సీపట్నంలో అన్ని కాలేజీల నుంచి 2,000 మంది విద్యార్థులతో ఘన అవగాహన సభ జరిగింది. ప్రధాన అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ భరణి మేడం సంబోధిస్తూ, “గంజాయి భవిష్యత్తును ధ్వంసం చేస్తుంది. యువత చట్టం పాటించి సమాజానికి మార్గదర్శకులుగా ఎదగాలి” అని పిలుపునిచ్చారు.టౌన్ ఇన్స్పెక్టర్ గఫూర్, రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, పాయకరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా సాగింది. విద్యార్థులు ప్లకార్డులు, తో “సేయ్ నో టు డ్రగ్స్” అని నినాదాలు ఇచ్చారు

1
970 views