logo

దేశ సుభిక్షం కోసం శ్రీ సోమసుందరేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం*

*దేశ సుభిక్షం కోసం శ్రీ సోమసుందరేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం*

200 సంవత్సరముల పైబడి చరిత్ర కలిగి మరియు *బ్రహ్మ సూత్రం* వున్న అత్యంత పురాతనమైన శివాలయం '' *శ్రీ సోమసుందరేశ్వర స్వామి (బాలాజీ గుడి)* దేవాలయం లో ఆర్ద్ర నక్షత్రం పురస్కరించుకొని 03/01/26 వ తేదీ ఉదయం 5 గంటల నుండి స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం , *దేశం మొత్తం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి అని స్వామి వారికి అన్నముతో అభిషేకించి* తదుపరి విశేష అలంకారణ, మహామంగళ హారతి , మంత్ర పుష్పం , తీర్థ ప్రసాద వినియోగం జరిగినది . తదనంతరం
స్వామి వారు పురవీధులలో ఊరేగింపుగా వెళ్ళారు.....
*అందరూ స్వామి వారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామి వారి కృపా కటక్షాలకు పాత్రులయ్యారు.*

*ఇట్లు*
*బ్రహ్మశ్రీ బ్రహ్మణపల్లి చంద్రమౌళి* *శర్మ*
*స్మార్త ఆగమ వేదపండితులు*
*ఆలయ ప్రధాన అర్చకులు*
*శ్రీ కామకోటి కళాంబా దేవి సమేత శ్రీ* *సోమసుందరేశ్వర* *స్వామి దేవస్థానం*
*దేవాదాయ ధర్మాదాయ శాఖ*
గడ్డిబజర్
*కడప

9
542 views