logo

* *పేదల ఆకలి తీర్చేందుకే శ్రీ విశాలక్షి పథకం..* * *పేద ప్రజల ఆకలి తీర్చే...ఆపద్బాంధవుడు..గోళ్ళ రాజేష్ .. * *రూపాయికే వెజిటబుల్ పలావ్, కర్రి పథకం

AIMA Adam Khan
పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకమని, నంద్యాల వాసి, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే
వెజిటబుల్ పలావ్, కర్రి ఇస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు నూర్ భాషా తెలిపారు.

నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం సమీపంలో ఏర్పాటు చేసిన వెజిటబుల్ పలావ్ కౌంటర్ ను కూరగాయల మార్కెట్ ప్రసాద్, ఏపీయుడబ్లుజె జిల్లా కార్యదర్శి ఉస్మాన్ భాషా, ఏపీయుడబ్లుజె,నంద్యాల ఉపాధ్యక్షులు నూర్ భాషాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోళ్ళ రాజేష్ పేదలకు తన వంతు సహాయం అందించేందుకు పేదల ఆకలి తీర్చేందుకు ఒక రూపాయికే వెజిటబుల్ పలావ్, కర్రీపప్పు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, పేద ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇటువంటి కార్యక్రమాన్ని గోళ్ళ రాజేష్ తల్లి విశాలాక్షి పేరిట ఈ పథకం నంద్యాలలో ప్రారంభించడం శుభ పరిణామమని, ప్రతిరోజు నిరంతరంగా ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గోళ్ళ రాజేష్ నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, ఇటీవల తుఫాన్ వల్ల పంట దెబ్బతిన్న కౌలు రైతులకు ఆర్థిక సహాయం, దీర్ఘకాలిక రోగులకు మందులు కొనేందుకు ఆర్థిక సహాయంగా కొన్ని లక్షల రూపాయలు పంపిణీ చేశారని, నిరుద్యోగ వికాస వృత్తి కింద ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున రెండు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

0
0 views