logo

ఒక్క క్షణంలో ఆవిరైన 20 ఏళ్ల కల..

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన నర్సింహ అనే వ్యక్తికి హంసలేఖ అనే కుమార్తె ఉంది. ఆమె బ్రిలియంట్‌ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్‌ ఫైనల్ ఇయర్ చదువుతోంది.అయితే మంగళవారం ఎగ్జామ్ ఉన్నందున అన్నమాచార్య కాలేజ్‌ సెంటర్‌లో పరీక్ష రాసేందుకు ఆమె తన స్నేహితుడితో కలిసి బైక్‌పై బయల్దేరింది.అయితే వారు సింగరేణి కాలనీలో లారీని ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించగా.. అదే సమయంలో అటుగా వస్తున్న మరో బైక్‌ హంసలేఖ, ఆమె స్నేహితుడు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న హంసలేఖ ఎగిరి కిందపడిపోయింది. దీంతో లారీ ఆమె శరీరంపై నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హంసలేఖ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.మరోవైపు ప్రమాద సమయంలో బైక్‌ నడుపుతున్న హంసలేఖ స్నేహితుడితో పాటు వాళ్ల బైక్‌ను ఢీకొట్టి వాహనంపై ఉన్న దీప్తి, సాయిగణేశ్,భానుప్రకాష్‌ల అనే విద్యార్థులు కూడాగాయపడ్డారు.

0
0 views