*రాత్రిపూట అదుపులేని దగ్గుకు ఇంటి చిట్కాలు*
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
*ఇంటి చిట్కాలు.....*
*పసుపు పాలు*
గోరువెచ్చని పాలల్లో పసుపు వేసుకుని తాగడం వల్ల వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
*తేనె*
ఒక టీస్పూన్ తేనె తీసుకోవడం లేదా వెచ్చని టీలో కలపడం గొంతును శాంతపరుస్తుంది.
*ఆవిరి పట్టడం*
వేడి నీటి ఆవిరి పీల్చడం వల్ల గాలి మార్గాలు తేమగా మారి, శ్లేష్మం తొలగిపోతుంది.
*ఉల్లిపాయతేనె సిరప్.....* ఉల్లిపాయ ముక్కలను తేనెలో నానబెట్టి ఆ సిరప్ తాగవచ్చు
*కరక్కాయ/లవంగం.....*
రాత్రి పడుకునే ముందు బుగ్గన పెట్టుకోవడం.
*జీవనశైలి మార్పులు.....*
తల ఎత్తుగా పెట్టుకోవడం పడుకునేటప్పుడు ఒకటి రెండు దిండ్లు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల శ్లేష్మం చేరడం తగ్గుతుంది.
*గాలి నాణ్యత*
గదిని శుభ్రంగా ఉంచుకోవడం, దుమ్ము లేకుండా చూసుకోవడం.