logo

కెసిఆర్ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం. బిఆర్ఎస్ కు జై కొట్టిన కడం మండలం గంగాపూర్ వాసులు !


ఖానాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ లో పెద్ద సంఖ్యలో చేరిన నాయకులు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచిందని భూక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు.
ఖానాపూర్ నియోజకవర్గంలోని కడం మండల పలువురు నాయకులు గంగాపూర్ గ్రామంలోని పార్టీలకు చెందిన 60మంది కార్యకర్తలుజాన్సన్ నాయక్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ గారు మాట్లాడుతూ.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంను సాకారం చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయని అన్నారు.
* సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమన్వయంగా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
* ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పనిచేసే పార్టీగా బీఆర్ఎస్‌పై విశ్వాసం పెరిగి, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు..
* గంగాపూర్ గ్రామ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
* బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, గుర్తింపు కల్పిస్తామని, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
* కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామాల్లో సమస్యలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు.
* కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి దిశగా నడిచాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలన వల్ల మళ్లీ గ్రామాలు వెనక్కి నెట్టబడుతున్నాయని పేర్కొన్నారు.
* ప్రజల సమస్యలపై ధైర్యంగా పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1
747 views