
కమిషన్లు కక్కుర్తి పడి గ్రామాభివృద్ధికి మోసం చేస్తున్న తెలుగుదేశం నాయకులు:ఎంపీపీ ఆర్థర్ సైమన్.
గోస్పాడు (AIMA MEDIA): నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, నేడు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు కేవలం మండలంలో వైసీపీ మెజారిటీ నాయకులు ఉన్నారన్న కక్షతో మండల స్థాయి అధికారులను బెదిరిస్తూ మండల అభివృద్ధి పనులను చేపట్టకుండా అడ్డుకుంటున్నారని, గోస్పాడు మండలం మంత్రి అభివృద్ధిని అడ్డుకోవడం సరైనది కాదని ఎంపీపీ ఆర్థర్ సైమన్ ఆరోపించారు. గోస్పాడు మండల నాయకులపై మాజీ ఎమ్మెల్యేపై అనవసర వ్యాఖ్యలు చేస్తూ అసత్యపు ఆరోపణలు చేయడం టీడీపీ నాయకులకు సరికాదని, ఈ నాయకులు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవుపలికారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, నేడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం నాయకులకు కప్పం కట్టాల్సిందేనని లేదంటే అభివృద్ధి కి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం నంద్యాలలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గృహంలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. గోస్పాడు ఎంపీపీ, వైసీపీ నేతలు, సర్పంచ్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను విస్మరిస్తు మండల పరిషత్, గ్రామపంచాయితీ తీర్మాణాలు పక్కన పెట్టి కూటమి ప్రభుత్వంలో తమ ఇష్టారీతిగా గ్రామాల్లో పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని, ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని విమర్శించారు. ఖరీఫ్ సీజన్లో మండలంలో సంబంధిత అధికారులు యూరియాను పంపిణీ చేయాల్సి ఉండగా టీడీపీ నాయకులు పంపిణీ చేయడం జరిగిందని, ఈ విషయంపై వైసీపీ ప్రశ్నించడం జరిగిందని తెలిపారు. దమ్ముంటే మండలంలో ఏ గ్రామానికి ఎంత యూరియా స్టాక్ వచ్చింతో ఎంత మందికి ఆధార్ కార్డు ఆధారంగా పంపిణీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్సీ నిధులు మంజూరు అయితే వాటికి సంబంధించి అభివృద్ది పనులకు మండల అధికారులు ఎందుకు ఎస్టిమేషన్స్ వేయలేదో చెప్పాలని ఇటీవల నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ, సర్పంచ్ లు ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై టిడిపి నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. రైతులకు పార్టీలు, కులాలు, మతాలు లేవని ఆటువంటి రైతన్నలకు అవసరమైన యూరియాను పంపిణీ ప్రక్రియలో టీడీపీ పార్టీనేతలు ప్రక్కదారిమల్లించారని ఆరోపించారు. ప్రజలచేత ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధులమైన తమ హక్కులు హరించడం వల్లే తాము కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వారు సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో వైస్ ఎంపిపి రాజు, ఎంపీటీసీ దేవరశెట్టి సుబ్రమణ్యం, చెన్న కృష్ణా రెడ్డి, ఇజయ్య, నరసింహా రెడ్డి, రాజా రెడ్డి, శంకర్ రెడ్డి, నారాయణ, జనార్ధన్ రెడ్డి, భక్తవత్సల రెడ్డి, రామసుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు.