logo

వాహన చోదకులు సీటు బెల్టు, హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలి *భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) వెంకట పుల్లయ్య,

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **భద్రాచలం టౌన్**: 02-01-2026**ఏఐఎంఏ మీడియా


*జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా భద్రాచలలో సీటు బెల్ట్ అవగాహన కార్యక్రమం నిర్వహణ*.


జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకుని, భద్రాచలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సీటు బెల్ట్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వాహనదారులకు సీటు బెల్ట్ ధరిస్తే వారి భద్రత పెరుగుతుంది, ప్రమాదాల బారిన పడకుండా ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యం. వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు విధిగా సీటు బెల్ట్, హెల్మెట్ ఉపయోగించాలి అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య సూచించారు.
కార్యక్రమంలో భాగంగా సీటు బెల్ట్ ధరించి వాహనాలు నడుపుతున్న వారికి గులాబీ పూలను అందించి ప్రోత్సహించారు. రవాణా శాఖ సిబ్బంది, స్థానిక అధికారులు, వాహనదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సీటు బెల్ట్ మరియు హెల్మెట్ ఉపయోగించాలన్న అవగాహన పొందారు.

56
1703 views